బ్రేకింగ్ న్యూస్
మాధవన్ ‘GDN’ కొత్త విడుదల తేదీ ఖరారు.. ఆగస్టు 7న థియేటర్లలోకిభారత్‌ టెక్స్‌ ప్రదర్శనలో 3 సంస్థలతో ఏపీ ఒప్పందాలు: మంత్రి సవితఅదృష్టమంటే ఇదే… టైమ్ పాస్ కోసం ఆడితే కోట్లు వచ్చి పడ్డాయి!చే’నేత’కు ఏపీ సర్కార్ గౌరవం.. రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతిమాన్‌గఢ్ ధామ్ వేదికగా మారుమోగిన ‘భీల్ ప్రదేశ్’ నినాదంస్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం: భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మసీదు తరలింపు వివాదం – ఉద్రిక్త వాతావరణంసోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు ఆకస్మిక ముగింపు – ఆసుపత్రికి తరలింపుమ్యాచ్ రద్దు అయితే ఛాన్స్ ఎవరికి..?సలాం తెలంగాణ రిపోర్టర్ బాలగోని నర్సింహాకి ఐడి కార్డు అందజేసిన ఎడిటర్ గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్మాధవన్ ‘GDN’ కొత్త విడుదల తేదీ ఖరారు.. ఆగస్టు 7న థియేటర్లలోకిభారత్‌ టెక్స్‌ ప్రదర్శనలో 3 సంస్థలతో ఏపీ ఒప్పందాలు: మంత్రి సవితఅదృష్టమంటే ఇదే… టైమ్ పాస్ కోసం ఆడితే కోట్లు వచ్చి పడ్డాయి!చే’నేత’కు ఏపీ సర్కార్ గౌరవం.. రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతిమాన్‌గఢ్ ధామ్ వేదికగా మారుమోగిన ‘భీల్ ప్రదేశ్’ నినాదంస్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం: భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మసీదు తరలింపు వివాదం – ఉద్రిక్త వాతావరణంసోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు ఆకస్మిక ముగింపు – ఆసుపత్రికి తరలింపుమ్యాచ్ రద్దు అయితే ఛాన్స్ ఎవరికి..?సలాం తెలంగాణ రిపోర్టర్ బాలగోని నర్సింహాకి ఐడి కార్డు అందజేసిన ఎడిటర్ గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్
అంతర్జాతీయం

అదృష్టమంటే ఇదే… టైమ్ పాస్ కోసం ఆడితే కోట్లు వచ్చి పడ్డాయి!

అదృష్టమంటే ఇదే… టైమ్ పాస్ కోసం ఆడితే కోట్లు వచ్చి పడ్డాయి!

అమెరికాకు చెందిన ఓ మహిళ విషయంలో నిద్రపట్టకపోవడం కూడా మంచే చేసింది. నిద్రలేమితో బాధపడుతూ, కాలక్షేపం కోసం స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్ ఆడితే, ఆమె రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది. నార్త్ కరోలినాలోని మూర్స్‌విల్లేకు చెందిన సూ రోలీ అనే మహిళకు ఈ అనూహ్య అదృష్టం వరించింది. ఆమెకు ఏకంగా 150,000 డాల‌ర్ల (సుమారు రూ.1.4 కోట్లు) జాక్‌పాట్ త‌గిలింది.

విసుగుతో ఆడితే… జాక్‌పాట్ తగిలింది
ఈ నెల‌ 8వ తేదీ రాత్రి సూ రోలీకి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. సమయం గడపడం కోసం ఆమె తన స్మార్ట్‌ఫోన్ తీసుకుని డిజిటల్ లాటరీ గేమ్స్ ఆడటం ప్రారంభించింది. అలా ‘టంబ్లింగ్ ట్రెజర్స్’ అనే కొత్త గేమ్‌పై 30 డాల‌ర్ల పందెం కాసింది. ఆశ్చర్యకరంగా ఆ ఒక్క గేమ్‌తోనే ఆమెకు భారీ జాక్‌పాట్ తగిలింది. లాటరీ అధికారుల ప్రకారం ఇంత పెద్ద మొత్తంలో బహుమతి గెలుచుకునే అవకాశాలు 20 లక్షలలో ఒకరికి మాత్రమే ఉంటాయి.

ఈ విజయం గురించి సూ రోలీ మాట్లాడుతూ.. “అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపట్టక ఫోన్‌లో ఏదో అలా గేమ్స్ ఆడుతున్నాను. ఇంత పెద్ద మొత్తం నాకే తగిలిందని స్క్రీన్‌పై చూసినప్పుడు నమ్మలేకపోయాను. ఎందుకంటే ఇలాంటివి నిజజీవితంలో జరుగుతాయని నేనెప్పుడూ ఊహించలేదు” అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

భారత్‌ టెక్స్‌ ప్రదర్శనలో 3 సంస్థలతో ఏపీ ఒప్పందాలు: మంత్రి సవిత

ఈ నెల‌ 13న రాలీలోని లాటరీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆమె తన బహుమతిని అందుకున్నారు. ఫెడరల్, రాష్ట్ర పన్నులు మినహాయించుకున్న తర్వాత ఆమెకు 108,023 డాల‌ర్లు (దాదాపు రూ.1 కోటి) చేతికి అందాయి. దీంతో ఆమె ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఈ డబ్బుతో తన ఇంటికి కొన్ని మరమ్మతులు చేయించాలని రోలీ ప్లాన్ చేసుకుంటోంది.

గత నెలలో బౌద్ధ సన్యాసికీ లాటరీ
ఇలాంటి అనూహ్య అదృష్టమే గత నెలలో మలేషియాకు చెందిన ఒక బౌద్ధ సన్యాసిని కూడా వరించింది. 73 ఏళ్ల చాన్ చాయ్ సియాంగ్ అనే సన్యాసి, తాను ఖాతా నిర్వహిస్తున్న బ్యాంకు నిర్వహించిన లక్కీ డ్రాలో ఏకంగా 1 మిలియన్ మలేషియన్ రింగిట్‌లు (సుమారు రూ.2.28 కోట్లు) గెలుచుకున్నారు. ఒకప్పుడు ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేసిన ఆయన, ప్రస్తుతం ఒక ఆశ్రమంలో నివసిస్తున్నారు.

అయితే, ఈ విజయంపై ఆయన స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది దైవకృప కాదని, తన పూర్వజన్మ కర్మఫలం మాత్రమేనని ఆయన తాత్వికంగా వ్యాఖ్యానించారు. డబ్బు కోసం తానెప్పుడూ ప్రత్యేక పూజలు గానీ, ప్రార్థనలు గానీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేమని ఈ రెండు సంఘటనలు నిరూపిస్తున్నాయి.

పాకిస్థాన్‌పై దాడులకు ఆత్మాహుతి దళాన్ని రంగంలోకి దించిన తాలిబన్లు